హోమ్ రేడియో పాత్రపై విద్యార్థులకు అవగాహన

ELR: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సమాచార పునరుద్ధరణలో హోమ్ రేడియో పాత్ర అనే అంశంపై జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందక ముందు సమాచారాన్ని చేరవేటంలో హోమ్ రేడియో బాగా ఉపయోగపడిందన్నారు. టెలి కమ్యూనికేషన్ సౌకర్యం లేక పూర్వం చాలా నష్టం జరిగిందన్నారు.