కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
BHPL: రేగొండ, గోరికొత్తపల్లి మండలాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు.