ఎంపీ నేటి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ హోదాలో విజయవాడ క్లబ్‌లో జరిగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఎన్నిక ప్రక్రియలో పాల్గొనుటకు వెళ్లనున్నారు. అనంతరం అక్కడి నుంచి పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్ళనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి.