ఈనెల 20న హాల్ టికెట్లు విడుదల

HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో అన్ని ఫ్యాకల్టీలలో పీహెచ్డి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ఈనెల 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ఓయూ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఓయూ అధికారిక వెబ్సైట్‌లో www.ouadmissions.com డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.