కందికొండ జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి
MHBD: కురవి మండలంలో బుధవారం కందికొండ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ జాతరలో పాల్గొన్నారు. స్వామి వారిని సందర్శించి, పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. BRS యువనాయకుడు గుగులోత్ శ్రీరాంనాయక్, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.