ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి: చింతమనేని

ELR: ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలు సమస్యలతో విచ్చేసిన ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. ఆ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.