బూర్లపల్లిలో ఐదేళ్ల బాలుడికి డెంగ్యూ.!

బూర్లపల్లిలో ఐదేళ్ల బాలుడికి డెంగ్యూ.!

అన్నమయ్య: పీటీఎం మండలంలో ఐదేళ్ల బాలుడు డెంగ్యూ వ్యాధి బారినపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండలంలోని బూర్లపల్లికి చెందిన నారాయణస్వామి కుమారుడు మోహన్(5) తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబీకులు, వైద్య పరీక్షలు చేయించారు. మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో ఉన్న డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి డెంగ్యూగా నిర్ధారించారు.