యువకులపై బీరు సీసాతో దాడి.. నిందితుడిపై కేసు నమోదు
WGL: గీసుగొండ మండల కేంద్రంలోని కొమ్మల గుడి వద్ద ఇద్దరు యువకులపై నిన్న రాత్రి అకారణ దాడి జరిగింది. లక్ష్మీపురానికి చెందిన మామునూరి దీక్షిత్ కుమార్ అనే వ్యక్తి బీరు సీసాతో దాడి చేయడంతో తోగరు సాయి, పవన్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఇవాళ గీసుగొండ CI విశ్వేశ్వర్ నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.