టీడీపీలో విషాదం.. సీనియర్ నేత మృతి

టీడీపీలో విషాదం.. సీనియర్ నేత మృతి

AP: టీడీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు బి.రామచంద్రరాజు కన్నుమూశారు. ఎన్టీఆర్ వీరాభిమానిగా, అఖిల భారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన 'ఎన్టీఆర్ రాజు'గా గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడుతూ, రామచంద్రరాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.