జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: అవనిగడ్డ లోని కార్ల స్టాండ్, చింత చెట్టు సెంటర్లో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వం కేవలం ఒక రాజకీయ పార్టీ సభ్యత్వం కాదని,ఇది ఒక బాధ్యత అని, ఒక నిబద్ధత, ఒక సంకల్పమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.