కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
WGL: చెన్నారావుపేట మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉచిత విద్యుత్‌తో పాటు మొక్కలకు క్వింటానుకు రూ. 2,400 కొనుగొలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.