గెజిటెడ్ క్వార్టర్స్ పనుల్లో జాప్యం.. మంత్రి ఆగ్రహం
GNTR: రాజధాని అమరావతిలో గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్స్ నిర్మాణ పనులను మంత్రి నారాయణ సోమవారం పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, షాపూర్జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేయలేకపోతే వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ, బాధ్యతారహితంగా ఉన్న ఇద్దరు ప్రతినిధులను పంపించేయాలని ఆయన ఆదేశించారు.