నేడు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం

నేడు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం

NLG: దేవరకొండలోని ముదిగొండ రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.