వైకల్య గుర్తింపు కార్డు జారీ కేంద్రం ప్రారంభం
నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు జారీ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా దివ్యాంగులు సులభంగా, వేగంగా తమ గుర్తింపు కార్డులను పొందగలుగుతారన్నారు. ప్రతి దివ్యాంగుడు గౌరవప్రదమైన జీవితం గడపడానికి ప్రభుత్వం చర్య తీసుకుంటుందని అన్నారు.