సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు

అన్నమయ్య: మదనపల్లె దేవళం వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.