సేవాభావం చాటుకున్న నెక్కొండ పోలీసులు

WGL: నెక్కొండ పోలీసులు మరొకసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా, నెక్కొండ బ్రిడ్జిపై గుంతలు ఏర్పడి స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విషయం గమనించిన స్థానిక పోలీసులు మొరం పోయించి గుంతలను పూడ్చి వేయించారు. ఈ సందర్భంగా వాహనదారులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులను అభినందించారు.