తీవ్రంగా నష్టపోయాం ఆదుకోండి: ఎమ్మెల్యే
NGKL: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల అచ్చంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పంటలు నష్టపోయి, రోడ్లు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఆదివారం కలిసిన ఆయన భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో జరిగిన నష్టం వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.