పెద్దగట్టు దేవాలయంలో పల్లె నిద్ర చేసిన మార్కెట్ చైర్మన్

పెద్దగట్టు దేవాలయంలో పల్లె నిద్ర చేసిన మార్కెట్ చైర్మన్

SRPT: చివ్వెంల మండలం దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి దేవస్థానంలో పౌర్ణమి నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున స్వామి వారికి, చౌడమ్మ తల్లికి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ నర్సయ్య యాదవ్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఆలయ ఈవో పాల్గొన్నారు.