ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

WGL: గీసుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డు చింతలపల్లి శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు బొడ్డుచింతలపల్లి శివారులో పేకాట శిబిరంపై గురువారం దాడి చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు రూ.10,390 నగదు, 5 స్మార్ట్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.