విద్యుత్ కార్మికుల మహాధర్నాకు సంఘీభావం
NLG: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాకు పలు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సుమ్మిరెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.