VIDEO: పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్న ట్రాన్స్ ఫార్మర్
కోనసీమ: అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గుత్తుల వారిపాలెంకి వెళ్లే దారిలో ఉన్న మెయిన్ ట్రాన్స్ ఫార్మర్ పిచ్చి మొక్కలతో అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో అస్తమానం ఫీజులు కొట్టేస్తున్నాయని, గ్రామానికి విద్యుత్ లైన్ మెన్ కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.