నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే
E.G: మొంథా తుఫాన్ కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అందరూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.