ప్రజావాణికి 51 ఫిర్యాదులు అందాయి: కలెక్టర్
RR: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి 51 ఫిర్యాదులు అందాయన్నారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.