VIDEO: అటవీశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

VIDEO: అటవీశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

NRML: ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అటవీ శాఖ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బాసర సర్కిల్ నిర్మల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వానన్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.