'జిల్లాలో రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ'

BHPL: జిల్లాలో రైతులకు సకాలంలో యూరియా అందించేందుకు 23 రైతు వేదికల ద్వారా విక్రయం చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు శుక్రవారం తెలిపారు. రేగొండలో మడతపల్లి, దమ్మన్నపేట, మొగుళ్లపల్లిలో ములకలపల్లి, పర్లపల్లి, చిట్యాలలో చైన్ పాక, జూకల్, ఘనపూర్లో పరశురాంపల్లి, భూపాలపల్లిలో పెద్దాపూర్, మలహర్లో రుద్రారంలో వేదికలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.