'ఇంటర్ ఫెయిలైయిన విద్యార్థులు ఫీజు చెల్లించండి'

WNP: ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు మే 2లోగా ఆయా కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మద్దిలేటి తెలిపారు. మే 24 నుంచి సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు రీకౌంటింగ్‌కు రూ.100లు, రీవెరిఫికేషన్‌కు రూ.600లు చెల్లించాలని తెలిపారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.