పంట పొలంలా మారిన రహదారి

పంట పొలంలా మారిన రహదారి

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కొమ్మినేనినగర్ 1/18 వీధి పంట పొలాన్ని తలపిస్తుంది. రహదారి నిర్మాణాన్ని గత 3 నెలలుగా అసంపూర్తిగా నిలిపివేశారు. దీంతో ఇటీవల కురిసిన వర్షంలతో నీరు నిలిచి, గడ్డి మొలిచి పంట పొలంలా మారింది. రాకపోకలు సాగించడానికి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఎంసీ అధికారులు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు.