మండపాలకు అనుమతి తప్పనిసరి: డీఎస్పీ

TPT: శ్రీకాళహస్తిలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు. వినాయక విగ్రహాలను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారో అక్కడి చిరునామా, పోలీసు స్టేషన్ పరిధి, విగ్రహానికి సంబంధించిన వివరాలు అందజేయాలన్నారు. నిమజ్జనం ఎక్కడ, ఎప్పుడు చేస్తారో అనే వివరాలు కూడా దరఖాస్తులో నింపాలని డీఎస్పీ తెలిపారు.