'వైన్ షాప్‌ను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయండి'
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని వైన్ షాప్‌ను గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని విన్నర్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కాడపాక చంద్రమౌళి ఇవాళ డిమాండ్ చేశారు. గ్రామ మధ్యలో వైన్స్ ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నూతన టెండర్ యజమానులు షాప్‌ను ఊరి బయట ఏర్పాటు చేయాలని కోరారు.