ఒంగోలు రిమ్స్‌కు మరో ఆధునిక పరికరం

ప్రకాశం: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా గర్భిణుల కోసం హిస్టీరోస్కోపి అనే పరికరాన్ని రిమ్స్ వైద్యశాలలో అందుబాటులోకి తెచ్చారు. సూపరింటెండెంట్ మాణిక్యరావు మాట్లాడుతూ.. ఈ పరికరం ద్వారా గర్భిణులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు.