రూ.3.05 లక్షల అపరాధ రుసుం విధింపు

రూ.3.05 లక్షల అపరాధ రుసుం విధింపు

GNTR: విద్యుత్ శాఖ విజిలెన్స్, సీఆర్డీఏ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మందడం సెక్షన్ పరిధిలో మంగళవారం విద్యుత్ కనెక్షన్ల తనిఖీ జరిగింది. లింగాయపాలెం, రాయపూడి, వెలగపూడి, వెంకటపాలెంలో 26 మంది అధికారులు, 85 మంది సిబ్బంది, బృందాలుగా ఏర్పడి 2,086 కనెక్షన్లను తనిఖీ చేసి, నియమాలకు విరుద్ధంగా ఉన్న కనెక్షన్లకు రూ.3.05 లక్షలు అపరాధ రుసుము విధించారు.