అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
BDK: చర్ల మేజర్ గ్రామ పంచాయతీ నుంచి భద్రాచలం ప్రధాన రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై, స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. నిర్వహణ లోపం కారణంగా డ్రైనేజీలో చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో మురుగునీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పారిశుద్ధ్య అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.