గుండెపోటుతో సీనియర్ వైసీపీ నేత మృతి

గుండెపోటుతో సీనియర్ వైసీపీ నేత మృతి

CTR: సదుం మండలం తాటిగుంటపాలెంకు చెందిన సీనియర్ వైసీపీ నేత హరినాథ్ రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక, మండల వైసీపీ నేతలు వారి ఇంటికి చేరుకుని హరినాథ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, రేపు హరినాథ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.