శ్రీకాళహస్తిలో గోడపత్రికల ఆవిష్కరణ

శ్రీకాళహస్తిలో గోడపత్రికల ఆవిష్కరణ

TPT: 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో జరిగే సీపీఐ పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ నేత చందు తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాళహస్తి సీపీఐ పార్టీ కార్యాలయంలో గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.