ఆపరేషన్ చేసి లోపలే బ్లేడు మర్చిపోయారు!

ఆపరేషన్ చేసి లోపలే బ్లేడు మర్చిపోయారు!

AP: వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన కాకినాడ జిల్లా తునిలో జరిగింది. ఓ యువకుడి కాలికి ఆపరేషన్ చేసి సిజేరియన్ బ్లేడు లోపలే మర్చిపోయారు. గతంలో ఆ యువకుడి కాలికి వైద్యులు స్టీల్ రాడ్డు స్క్రూ వేశారు. అయితే, శస్త్రచికిత్స చేసి స్క్రూ తొలగించి, లోపలే సిజేరియన్ బ్లేడు మర్చిపోయారు. మళ్లీ వైద్యులను సంప్రదించడంతో బ్లేడు తొలగించారు.