ప్రభుత్వ భూములను గుర్తించాలి: కలెక్టర్
WNP: భూభారతి డేటా ప్రకారం జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను సర్వేనెంబర్ల ఆధారంగా గుర్తించాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. ప్రభుత్వ భూముల గుర్తింపుపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాప్యం చేయకుండా వారం రోజులలో గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.