విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

సంగారెడ్డి: కొండాపూర్ మండలం హరిదాస్ పూర్ గ్రామంలో బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా ఉట్టి కొడుతుండగా విద్యుత్ షాక్‌తో చింటూ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమేశ్వరి తెలిపారు.