పేకాట శిబిరంపై దాడి.. 12 మంది అరెస్ట్
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని పుల్లూరులో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. నిందితుల నుంచి రూ.11,200ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.