జడ్పీహెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
JGL: ఎండపల్లి మండలం ZPHS పాతగూడూరు పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ నేడు సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం కింద నిర్మాణంలో ఉన్న కిచెన్ షెడ్ పనులను పరిశీలించి నాణ్యత, పురోగతిపై ఆరా తీశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలు, పాఠశాల కార్యక్రమాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు పాల్గొన్నారు.