ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మండలం మునిగేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా నిర్మించిన నూతన ఇంటిని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహప్రవేశ వేడుకలు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నిజం చేసిందన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.