క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
మహబూబాబాద్: జిల్లా సీరోల్ మండలం రేకులతండా గ్రామపంచాయతీ పరిధిలోని రూప్లా తండాలో క్రికెట్ టోర్నమెంట్‌ను మంగళవారం ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ జగదీష్, మార్కెట్ ఛైర్మన్ సుధాకర్ నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.