VIDEO: చిన్నారి మృతిపై ఖమ్మంలో నిరసన ర్యాలీ
KMM: నాగర్ కర్నూల్ జిల్లాలో రజక కుటుంబంపై దాడి జరిగి, చిన్నారి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఖమ్మంలో నిరసన చేపట్టారు. రజక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రజకుల ఐక్యత వర్ధిల్లాలని ఈ సందర్భంగా నినాదించారు. ఎడపల్లి హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.