వైసీపీకి 25 స్థానాలు కూడా దక్కవు: రఘురామ

KDP: వైసీపీకి 25 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఎంపీ, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు అన్నారు. జూన్ 4 వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్ ఆశలు ఆవిరవుతాయన్నారు. శుక్రవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వేంకటేశ్వరస్వామిని కోరుకున్నారు.