'గిరిజనులను ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యం'

'గిరిజనులను ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యం'

NLR: జిల్లాలో ఓ హోటల్లో ఆదివారం గిరిజన సంఘం నేతలు సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల జేఏసీ కన్వీనర్ పాలకీర్తి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ గిరిజనులు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని, గిరిజనులలో చైతన్యాన్ని నింపి ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యంగా గిరిజన సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.