శ్రీ మళ్లికార్జున స్వామి దర్శించుకున్న కలెక్టర్

శ్రీ మళ్లికార్జున స్వామి దర్శించుకున్న కలెక్టర్

HNK: ఐనవోలు మండల కేంద్రంలో గురువారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు, వేదపండితులు ఆమెకు స్వాగతం పలికారు. కలెక్టర్ స్వామి వారికి అభిషేకం చేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శేష వస్త్రాలతో ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు.