నేడు సుప్రీంకోర్టులో 'ఓటుకు నోటు' విచారణ

నేడు సుప్రీంకోర్టులో 'ఓటుకు నోటు' విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నందున రాష్ట్రంలోని ఏసీబీ కోర్టులో విచారణ పారదర్శకంగా జరగదని, ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.