VIDEO: ఘనంగా గీతా జయంతి ఉత్సవాలు
MDK: తూప్రాన్ పట్టణంలోని గీతా మందిరంలో 43వ గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవం పురస్కరించుకుని ఉదయం అష్టాదశ ద్రవ్యాలతో మహాభిషేకం, భగవద్గీత పారాయణం, హవనం, పూర్ణాహుతి, అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. భక్తులు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు