ప్రధాన రహదారిపై తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతులు

ప్రధాన రహదారిపై తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతులు

WGL: దుగ్గొండి గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు కోతకు సిద్ధం చేసిన మొక్కజొన్న ధాన్యం తడిసి మొలకెత్తింది. పంట నష్టపోవడంతో రైతులు ఉదయం నుండి ప్రధాన రహదారిపై ధాన్యాన్ని ఆరబోసే పరిస్థితి నెలకొంది. తడిసిన ధాన్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.