'ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత'

'ఐరన్ మాత్రలు వికటించి విద్యార్థులకు అస్వస్థత'

ADB: ఐరన్ మాత్రలు వికటించి భజరహత్నూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం తిన్నాక ఐరన్ మాత్రలు వేసుకున్న చిన్నారులు వాంతులు చేసుకున్నట్లు మండల ఎంఈఓ రామ్ కిషన్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏడుగురు విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.