'మురుగు నీటిని తొలగించండి'
KDP: సిద్ధవటం మండలం టక్కోలు ఎస్సీ కాలనీలోని గ్రామ వీధులు బురదమయంగా మారాయి. దీంతో పారిశుధ్య లోపం ఏర్పడి దోమలు అధికంగా చేరి విష జ్వరాల సోకుతున్నాయని మంగళవారం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఏమాత్రం స్పందించలేదన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.